గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 14
14

అన్నాద్భవంతి భూతాని
పర్జన్యాదన్నసంభవ: |
యజ్ఞాద్భవతి పర్జన్యో
యజ్ఞ: కర్మసముద్భవ: ||

తాత్పర్యము : జీవదేహములన్నియును వర్షము వలన ఉత్పన్నమైనట్టి ధ్యానముపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞముచే కలుగగా, విహిత కర్మము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది.

భాష్యము : వాస్తవమునకు ధాన్యము మరియు కూరగాయలే మనకు ఆహార యోగ్యములు. మాంసభక్షణ చేయువారు కూడా జంతువుల పోషణకు గడ్డి, చెట్లపైననే ఆధారపడవలసి ఉన్నది. కాబట్టి చివరకు భూ ఉత్పత్తులపైననే ఆధారపడి ఉన్నాము కాని కర్మాగార ఉత్పత్తులపై కాదు. భూ ఉత్పత్తులు వర్షాధారము. అవి దేవతా ఆధీనము. కావున కనీసము ఆహార పదార్థముల కొరత నుండి రక్షించబడుటకైనను యజ్ఞమును (ముఖ్యముగా”హరినామసంకీర్తనము”) నిర్వహింపవలసి యున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *