తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో… ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.