నగర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది
నగర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది
- బాలగంగాధర్ తిలక్
ఖమ్మం, ఆంధ్రప్రభ:
ఖమ్మం నగర ప్రజలకు సరికొత్త రుచులను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి మేధన్ష్ ఫుడ్ జోన్ సిద్ధమైంది. ఖమ్మం నగరం గుట్టల బజార్, కిన్నెరసాని థియేటర్ పక్కన నూతనంగా ఏర్పాటు- చేసిన ఈ హోటల్‌ను ఆదివారం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, త్రీ టౌన్ ఏరియా కో-ఆర్డినేటర్ యర్రం బాలగంగాధర్ తిలక్, టీఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ప్రారంభించారు.
అనంతరం యర్రం బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఖమ్మం నగరం రోజురోజుకూ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా ఇలాంటి ఆధునిక వసతులతో కూడిన హోటళ్లు రావడం శుభపరిణామన్నారు. వ్యాపార రంగాలు విస్తరించడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, నగర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలకు కేవలం ఆహారాన్ని రుచిగా అందించడమే కాకుండా.. నాణ్యత, శుభ్రత పాటించినప్పుడే వ్యాపారం దీర్ఘకాలం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. మేదాన్ష్ ఫుడ్ జోన్ నిర్వాహకులు కూడా అదే బాటలో పయనించి కస్టమర్ల మనసులు గెలవాలన్నారు. ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాసరావు, బాలగంగాధర్ తిలక్ మేధాన్ష్ ఫుడ్ జోన్ ప్రొప్రైటర్స్ కూచిపూడి శ్రీనివాసరావు,కూచిపూడి ఉదయ్ కుమార్‌ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గుంటు-పల్లి శ్రీనివాసరావు, టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి కొనిదేనా శ్రీనివాస్, టీఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షులు కోమగిరే దుర్గా ప్రసాద్, టీఎన్జీఓస్ జాయింట్ సెక్రటరీ వల్లూరి శ్రీకాంత్,కూరపాటి రుక్మారావు, జిల్లా సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీ డి.శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూచిపూడి ముద్దు కృష్ణ, మెట్టు- సల్మాన్, కూచిపూడి ప్రవీణ్ కుమార్, కూచిపూడి ఉపేందర్, దేవరకొండ ఫని, సురవెల్లి శ్రీనివాస్, కలకోట వెంకన్న, వెంపటి సాయి తదితరులు పాల్గొన్నారు.
