భూత్పూర్‌లో బీజేపీ హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ..
భూత్పూర్, ఆంధ్రప్రభ : దేశభక్తి నినాదాలతో భూత్పూర్ పట్టణం మార్మోగింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర నాయకుడు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది.జాతీయ జెండాలను చేతబూని ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ప్రయాణించారు.దేశభక్తి నినాదాలు చేస్తూ ముందుకు సాగిన ర్యాలీతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశం పట్ల బాధ్యత, జాతీయ సమైక్యత, సార్వభౌమత్వం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యువతలో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలిపారు.
