RAIN | దిత్వా తుఫాన్.. అప్రమత్తంగా ఉండాలి

RAIN | దిత్వా తుఫాన్.. అప్రమత్తంగా ఉండాలి

నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు

RAIN | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : దిత్వా తుఫాను కారణంగా నెల్లూరు జిల్లాలో మూడు రోజులపాటు భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయ‌ని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ (Collector) మొగిలి వెంకటేశ్వర్లు సూచించారు. ఈ రోజు తుఫాన్ పై టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో ఆయన మాట్లాడుతూ.. నేటి సాయంత్రం, రేపు, ఎల్లుండి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన‌ట్లు తెలిపారు.

తుపాన్ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాల‌ని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తాత్కాలిక పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి తాగునీరు, ఆహారం, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామాల్లో పోలీసులు (Police) రెవెన్యూ, కలిసి విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. అలాగే, జలపాతాలు, వాగులు, కాలువలు, ప్రమాదకర పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

విద్యుత్ శాఖ అవసరమైన స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లు, జనరేటర్లను ముందుగానే సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలు పనిచేయాలని సూచించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, పంచాయతీ రాజ్, మున్సిపల్, శాఖలతో పాటు అన్ని లైన్ డిపార్ట్‌మెంట్ లు 24/7 అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాన్ సమయంలో వైద్యశాఖ (Medicine) అత్యవసర వైద్య సిబ్బంది. అంబులెన్స్‌లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని, పశువుల కోసం కూడా తగిన వైద్యసాయం అందుబాటులో ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద పరిస్థితులు తలెత్తే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు జిల్లా కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ కోరారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకి 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.

Leave a Reply