న్యూ ఢిల్లీ: భారత వాయుసేనకు చెందిన ఫైటర్‌జెట్ విమానం గుజరాత్‌లో కూలిపోయింది. ఈ ఘటనలో ఓ పైలట్ మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. ఘటనను భారత వైమానికదళం ధ్రువీకరించింది
బుధవారం జరిగి రాత్రి జామ్‌నగర్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సువర్దా గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో ఫైటర్ జెట్ కూలిపోయి.. ఆ తర్వాత మంటలు చెలరేగాయని ఎస్పీ ప్రేమ్‌సుఖ్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానం క్రాష్ ల్యాండ్ అయ్యాక మంటలు చెలరేగాయి.
.జామ్‌నగర్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఎగురుతున్న ఐఏఎఫ్ జాగ్వార్ రెండు సీట్ల విమానం రాత్రి మిషన్ సమయంలో కూలిపోయిందని భారత వైమానికదళం పేర్కొంది. పైలట్లు విమానంలో సాంకేతిక లోపాన్ని గమనించిన వెంటనే ఎయిర్‌ఫీల్డ్, స్థానికులకు ఎలాంటి నష్టం జరుకుండా చూసుకుంటేనే.. విమానం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారని పేర్కొంది.
క్రమంలో దురదృష్టవశాత్తు ఓ పైలట్ తీవ్రంగా గాయపడి.. ప్రాణాలు కోల్పోయడని పేర్కొంది. మరో పైలట్ జామ్‌నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై ఎయిర్‌ఫోర్స్ విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. ప్రమాదంపై విచారణకు ఆదేశించింది. .