High Court | హెచ్ సి యు భూముల వివాదం – విచార‌ణ వాయిదా

హైద‌రాబాద్ – హెచ్ సి యు భూముల విచార‌ణ‌ను నేడు హైకోర్టు విచార‌ణ‌ను వాయిదా వేసింది..ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదని పేర్కొంటూ విచార‌ణ ఈ నెల 24వ తేదికి వాయిదా వేసింది. . అలాగే కౌంటర్, రిపోర్ట్‌ను ఈ నెల 24 లోగా సమర్పించాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది.

కాగా,సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల విషయంలో ఇటీవల కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఫేక్ వీడియోలు, తప్పుడు ఫోటోలను ప్రసారం చేస్తూ కావాలనే వివాదం సృష్టిస్తున్న దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫేక్ ప్రచారంలో యూనివర్సిటీ భూములను అక్రమంగా ఆక్రమించారని, పర్యావరణాన్ని ధ్వంసం చేశారనీ, వన్యప్రాణులకు నష్టం వాటిల్లిందంటూ ఊహాగానాలు వ్యాప్తి చెయ్యడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందిస్తూ, ఈ తప్పుడు ప్రచారంపై చట్టపరంగా కోర్టుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. దీంతో దీనిపై కూడా ప్ర‌భుత్వం హైకోర్ట‌లో పిటిష‌న్ దాఖలు చేయ‌నుంది..

Leave a Reply