AP | ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. యువతి గల్లంతు..
కాలువలో దూకిన యువకుడిని కాపాడిన స్థానికులు..
యువతి కోసం గాలింపు
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాలకోడేరు మండలం వేండ్ర అడవి కోడి కాల్వ వద్ద ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరూ కాలువలోకి దూకడంతో స్థానికంగా కలకలం రేగింది.
కాలువలోకి దూకిన యువకుడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అతడిని రక్షించారు. అయితే యువతి మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో ఆమె కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. కుముదవల్లి గ్రామానికి చెందిన సందీప్ కుమార్, భీమవరానికి చెందిన యువతి ఈ ఘటనలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కాలువలో గల్లంతైన యువతి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతిని గుర్తించేందుకు, ఘటనకు దారితీసిన పూర్తి కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
