రాఘవరెడ్డిపేటలో ఘనంగా వనమహోత్సవం
టేకుమట్ల, ఆంధ్రప్రభ: టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట గ్రామంలో సర్పంచ్ వంగ మమత శ్రీధర్ ఆధ్వర్యంలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరీలో పెంచిన మొక్కలను గ్రామంలోని ఇంటింటికీ పంపిణీ చేశారు.
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్ వంగ మమత శ్రీధర్ కోరారు. పంపిణీ చేసిన మొక్కలను ఇంటి ఆవరణలో నాటి బిడ్డలా చూసుకోవాలని సూచించారు. గ్రామాన్ని హరిత గ్రామంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ పవన్, కారోబారు తిరుపతి, గ్రామస్తులు వంగ రాజయ్య, వేణువంక తిరుపతి, వంగ కరుణ, వేణువంక రవీందర్, దూఢపాక రాజయ్య, ముంజల తిరుమల, చిలుక రవీందర్, సమ్మయ్య, సంతోష్, సంపత్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
