‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో జెండాల పంపిణీ

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యత, సమగ్రతను చాటిచెప్పాలని బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్, ఊట్కూర్ సర్పంచ్‌ ఎం. రేణుక భరత్, బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి పిలుపుమేరకు నిర్వహిస్తున్న ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరామ్‌నగర్ వీధిలో వారు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్థానికులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశభక్తి భావనను పెంపొందించుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను చాటిచెప్పాలని కోరారు.

యువత, విద్యార్థులు, ప్రజలు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ హన్మంతు, ఉప సర్పంచ్‌ రమేష్, జిల్లా నాయకులు ఆశప్ప, కొండన్ గోపాల్, పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, మాజీ మండల అధ్యక్షుడు రమేష్, మండల ప్రధాన కార్యదర్శులు తారా కృష్ణ, రణవీర్, నాయకులు, కార్యకర్తలు లక్ష్మణ్, అశోక్‌గౌడ్, బాలాంజనేయులు, రవి, మహేష్, సహదేవ తదితరులు పాల్గొన్నారు.