వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు కుమార్తె జోనిట-దాస్ వివాహ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బిచ్కుంద మండలంలోని డిపిఎల్ సైట్ ప్లాంట్ వద్ద గాల ప్రాంగణంలో జుక్కల్ ఎమ్మెల్యే కుమార్తె జోనిట-దాస్ వివాహ విందు అంగరంగ వైభవంగా,కన్నుల పండుగగా ఆదివారం నిర్వహించారు.

ఈ వివాహ విందుకు హెలికాప్టర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి రాగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ఎమ్మెల్యేలు,ఎంపీలు,డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ హెలిప్యాడ్ వద్ద వారికి స్వాగతం పలికారు.

నేరుగా డీబీఎల్ విందు ప్రాంగణం కు వెళ్లివారు నూతన వధూవరులైన జోనీట-దాస్ ను ఆశీర్వదించారు. నూతన దంపతులు నిండు నూరేళ్లు ఆయురరోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.వీరితో పాటు జాహిరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్,ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి,షబ్బీర్ అలీ,మదన్మోహన్,పట్లోళ్ల సంజీవరెడ్డ,దేగ్లూర్ ఎమ్మెల్యే అంతపూర్ జితేష్ రావుసాహెబ్ తదితరులు కూడా వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాహ విందుకు హాజరైన అశేష జనావాహిని అభివాదం చేశారు.తమ కుమార్తె పెళ్లికి ముఖ్యమంత్రితోపాటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు,ఎంపీ, ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ నాయకులు,పార్టీలకు అతీతంగా నాయకులు,అధికారులు అనధికారులు జుక్కల్ నియోజకవర్గ అన్ని గ్రామ గ్రామాల నుండి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలకు, బంధుమిత్రులకు, ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు-తోట అర్చన కృతజ్ఞతలు తెలిపారు. బిచ్కుంద లోని డిబిఎల్ ప్రాంతం జనసంద్రంగా మారింది.