మహిళల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

మహిళల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

చల్లపల్లి సీఐ ఈశ్వరరావు

ఘంటసాల – ఆంధ్రప్రభ : మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చల్లపల్లి సిఐ ఈశ్వరరావు తెలిపారు. గురువారం ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం జడ్పీ హైస్కూల్లో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చల్లపల్లి సిఐ ఈశ్వర్ రావు, ఎస్సై వేమన చందన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మహిళలకు భద్రతగా పోలీస్ శాఖ ఉంటుందని తెలిపారు. సమాజంలో ఎలాంటి ఇబ్బందులు కలిగిన మహిళలకు రక్షణగా పోలీసులు ఉంటారని తెలిపారు. గృహ హింస, పోక్సో, ఇతర చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఎస్ఐ చందన మాట్లాడుతూ వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థుల తల్లితండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. చెరువులు, నదుల్లో స్నానాలకు వెళ్లకుండా చూడాలన్నారు. విద్య ద్వారానే ఉన్నత స్థాయికి ఎదగుతామని తెలిపారు.

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం..

పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలపై సిఐ, ఎస్ఐ అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, మే నెల ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బాబురావు, కొండవీటి కృష్ణమూర్తి, హెచ్ఎం సురేష్ బాబు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

Leave a Reply