గుడివాడలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త బ్రాంచ్‌

  • ఏపీలో నెట్‌వర్క్‌ 15 శాఖలకు విస్తరణ..
  • రూ.50 లక్షల వరకు తక్షణ రుణ ఆమోదం

గుడివాడ, ఆంధ్రప్రభ : ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఏబీహెచ్‌ఎఫ్‌ఎల్‌) ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. దేశవ్యాప్తంగా సేవల విస్తరణలో భాగంగా గుడివాడలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలో సంస్థ శాఖల సంఖ్య 15కు చేరుకుంది.

వ్యవసాయం, ఆక్వాకల్చర్‌, రైస్‌ మిల్లులు, వ్యాపార కార్యకలాపాలతో కీలక వాణిజ్య కేంద్రంగా ఎదుగుతున్న గుడివాడలో గృహ రుణాల అవసరాలు పెరుగుతున్నాయని సంస్థ తెలిపింది. విజయవాడ, మచిలీపట్నం వంటి నగరాలతో మెరుగైన రవాణా అనుసంధానం, పెరుగుతున్న నివాస నిర్మాణాలు సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారి సంఖ్యను పెంచుతున్నాయని పేర్కొంది.

ఈ నేపథ్యంలో కొత్త బ్రాంచ్‌ ద్వారా వేతన జీవులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, నిపుణులకు వివిధ రకాల గృహ రుణ సేవలను మరింత సులభంగా అందించనుంది. అఫోర్డబుల్‌ హౌసింగ్‌, ప్రైమ్‌ హౌసింగ్‌, గృహ నిర్మాణ రుణాలు, ఆస్తిపై రుణాలు వంటి సేవలను సంస్థ అందిస్తోంది.

డిజిటల్‌ విధానాలతో వేగవంతమైన రుణ ప్రక్రియ, పారదర్శక సేవలను అందించడంపై దృష్టి సారిస్తున్నట్లు ఏబీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వెల్లడించింది. కస్టమర్లకు సులభమైన దరఖాస్తు ప్రక్రియ, త్వరితగతిన రుణ ఆమోదాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

కొత్త బ్రాంచ్‌ ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఉచిత లాగిన్‌ ఫీజుతో పాటు రూ.50 లక్షల వరకు తక్షణ రుణ ఆమోదం అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్‌ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 31, 2026 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

ఈ సందర్భంగా ఏబీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ, సీఈఓ పంకజ్‌ గాడ్గిల్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ తమకు కీలకమైన మార్కెట్‌ అని తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ స్థాయిలో సేవలను విస్తరిస్తున్నామని చెప్పారు. బలమైన డిజిటల్‌ వ్యవస్థతో వినియోగదారుల సొంతింటి కలను సులభంగా నెరవేర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

‘హ్యాపీ హోమ్‌ లోన్‌ జర్నీ’ లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఏబీహెచ్‌ఎఫ్‌ఎల్‌.. బాధ్యతాయుతమైన రుణ సేవల ద్వారా మరింత మంది వినియోగదారులకు చేరువ కావాలని భావిస్తోంది.