birth anniversary | ఆయన ప్రజా జీవితం, పరిపాలనలో అందించిన సేవలు చిరస్మరణీయం
శాసనసభ మెంబర్స్ లాంజ్‌లో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసిన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్‌తో పాటు అధికారులు నివాళులర్పణ
birth anniversary | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, దివంగత కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా తెలంగాణ శాసనసభలో ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని శాసనసభ మెంబర్స్ లాంజ్‌లో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రజా జీవితం, పరిపాలనలో అందించిన సేవలను స్మరించుకున్నారు.
కొణిజేటి రోశయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా గుర్తింపు పొందారని నాయకులు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేయడంతో పాటు, అనంతరం తమిళనాడు గవర్నర్‌గా కూడా రాజ్యాంగబద్ధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు.
ఈ నివాళి కార్యక్రమంలో శాసనసభ, శాసనమండలి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని దివంగత కొణిజేటి రోశయ్యకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన నిజాయితీ, నిరాడంబరత, ప్రజాసేవ పట్ల అంకితభావం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.
