Bhavanipuram | నూతన దంపతులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి పెళ్లి కానుక..

Bhavanipuram | నూతన దంపతులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి పెళ్లి కానుక..

ఆంధ్రప్రభ, భవానీపురం: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తన నియోజకవర్గ పరిధిలో వివాహం చేసుకుంటున్న నూతన దంపతులకు ప్రత్యేకంగా ‘సుజనా పెళ్లి కానుక’ అందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. వివాహ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు పంపించిన కుటుంబాలకు వధువుకు చీర, వరుడికి ప్యాంటు-షర్ట్, స్వీట్ బాక్స్‌తో పాటు పసుపు, కుంకుమలను కానుకగా అందజేస్తున్నారు.

ఈ క్రమంలో 46వ డివిజన్ భీమనవారిపేటకు చెందిన షేక్ నజియా, నాగూర్ భాష (మరణించిన) దంపతుల కుమార్తె షేక్ సాదియా వివాహం షేక్ రఫీతో శనివారం వాల్మీకి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే కార్యాలయం తరఫున కూటమి నాయకులు, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొని నూతన వధూవరులకు ‘సుజనా పెళ్లి కానుక’ అందజేశారు.

ఈ సందర్భంగా కొత్త జంట సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ధనాల శ్రీనివాసరావు, చొక్కా నరేష్, దేవిన హరిప్రసాద్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply