బేల్దారి మేస్త్రీ దుర్మరణం
అడ్డదిడ్డంగా లారీలు నిలిపివేత
ఆంధ్రప్రభ, దగదర్తి (నెల్లూరు జిల్లా) జాతీయ రహదారిపై అడ్డుగా నిలిపిన లారీలను తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టిన ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో జరిగింది. నెల్లూరు జిల్లా (Nellore District) దగదర్తి మండలం ముసునూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన బేల్దారి మేస్త్రి అహ్మద్ బాషా ఆదివారం రాత్రి నెల్లూరు నుంచి కాలు వైపునకు వెళ్తుండగా జాతీయ రహదారిపై మణికంఠ దాబా (Manikantha Dhaba) సమీపంలో అడ్డుగా నిలిపిన లారీలను తప్పించే ప్రయత్నంలో డివైడర్ ను బైక్ ఢీకొంది. ఈ దుర్ఘటన స్థలిలోనే భాషా మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

