ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు (సోమవారం) న్యూజిలాండ్ – బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. కాగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు… నిర్ణీత ఓవర్లలో 236/9 పరుగులు చేసింది.
కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (77) అద్భుత ప్రదర్శనతో హీఫ్ సెంచరీ సాధించగా.. జఖర్ అలీ (45) పరుగులతో రాణించాడు. తంజిద్ హసన్ (24), రిషద్ హొస్సేన్ (26) పరువాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేకపోయారు.
కివీస్ బౌలర్లలో మిచెల్ బ్రేస్‌వెల్ 4 వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. ఇక, విల్ ఓ’రూర్కే రెండు వికెట్లు తీయగా.. కైల్ జేమీసన్, మాట్ హెన్రీ తలో వికెట్ పడగొట్టారు.
అయితే, భారత్ తో మ్యాచ్ లో ఓడిపోయిన బంగ్లాదేశ్ జట్టు.. సెమీస్ అవకాశాన్ని సజీవంగా ఉంచుకోవాలంటే ఈ గెలవడం చాలా ముఖ్యం. బంగ్లాదేశ్ నెట్ రన్ రేట్ చాలా పేలవంగా ఉంది. సెమీ-ఫైనల్ కు చేరుకునే రేసులో కొనసాగాలంటే బంగ్లాదేశ్ ఎలాగైనా గెలవాలి.
మరోవైపు తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారీ విజయంతో ఉత్సాహంగా ఉన్న న్యూజిలాండ్… ఈ మ్యాచ్ లోనూ గెలిచి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలని భావిస్తోంది. బంగ్లాదేశ్ పై కివీస్ జట్టు గెలిస్తే సెమీస్ కు చాలా దగ్గరగా చేరుకుంటారు. దీంతో బంగ్లాదేశ్ నిర్ధేశించిన 237 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగనుంది కివీస్ జట్టు.