Awareness | విద్యుత్ పొదుపు పై…

Awareness | విద్యుత్ పొదుపు పై…

Awareness | ఒంగోలు, ఆంధ్రప్రభ : విద్యుత్ పొదుపు, సమర్ద వినియోగం పై ప్రజలకు విస్తృత స్దాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ఆ ర్.గోపాలకృష్ణ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) ప్రకాశం సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు పట్టణంలో ఇంధన పొదుపు అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ భవన్ వద్ద జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. విద్యుత్ భవన్ వద్ద నుంచి చర్చి సెంటర్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్దులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ… ప్రజలకు, యువతకు విద్యుత్ పొదుపు గురించి అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ ను పొదుపుగా వినియోగించడంతో పాటు భద్రంగా వినియోగించాలన్నారు. సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని పెంచాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ఉపయోగించుకోవాలి అన్నారు. ఆయా విషయాల పై వారం రోజుల పాటు వివిధ రూపాలలో ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను అధికార యంత్రాంగం రూపొందించింది అన్నారు. ఈ సందర్భంగా పోస్టర్లను, బ్యానర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీపీడీసీఎల్ ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply