శ్రీవారి మెట్టు వద్ద చిరుత సంచారం..

శ్రీవారి మెట్టు వద్ద చిరుత సంచారం..
తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం సమీపంలోని శ్రీవారి మెట్టు వద్ద చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలోని మండపం వద్ద ఆదివారం ఉదయం 6:50 నిమిషాలకు అడవిలో నుంచి రోడ్డు పైకి వచ్చింది. అదే సమయంలో అటు వైపు వెళుతున్న ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు చూసి భయభ్రాంతులకు గురయ్యారు. సమీపంలోని విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది చిరుత సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించగా చెట్టు పై కూర్చున్నట్లు గమనించి శబ్దాలు చేసినా వెళ్లకపోవడంతో చేసేది ఏమీ లేక విజిలెన్స్ సిబ్బంది రోడ్డు పై నడుచుకుంటూ వెళుతున్న భక్తులు, వాహనదారులను అప్రమత్తం చేస్తూ రాకపోకలను సాగిస్తున్నారు. భక్తులు గుంపులుగా అప్రమత్తంగా వెళ్లాలని విజిలెన్స్ సిబ్బంది సూచించారు.
