స్నేహా సొసైటీ సేవలు అనిర్వచనీయం..

స్నేహా సొసైటీ సేవలు అనిర్వచనీయం..
నిరుపేద విద్యార్థినికి రూ.51 వేల ల్యాప్ టాప్ అందజేత
ఘంటసాల, ఆంధ్రప్రభ : స్నేహా సొసైటీ పేద విద్యార్థులకు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని లంకపల్లి పీఏసీఎస్ చైర్ పర్సన్ యెనుముల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఘంటసాల మండల పరిధిలోని మల్లాయిచిట్టూరు గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని కుంపటి తేజస్వినికి రూ.51 వేల విలువ గల ల్యాప్ టాప్ ను అందజేశారు. ఈ సందర్భంగా స్నేహా సొసైటీ ప్రతినిధి సామర్ల మల్లిఖార్జునరావు మాట్లాడుతూ స్నేహా సొసైటీ గౌరవ అధ్యక్షులు, హైదరాబాద్ లో ఉంటున్న కావూరి రవీంద్ర కుమార్ ను విద్యార్థి చదువు కోసం ల్యాప్ టాప్ అందించాలని కోరగా, ఆయన వెంటనే స్పందించి రూ.51 వేలు ఆర్థిక సాయం అందించారు. ఆ నగదుతో విద్యార్థినికి రూ.51 వేల విలువైన ల్యాప్ టాప్ ను అందించినట్లు తెలిపారు.
విద్యార్థిని తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటూ విద్యార్థిని చదివించటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో చదువు కోసం ల్యాప్ టాప్ కోసం స్నేహ సొసైటీని సంప్రదించినట్లు తెలిపారు. విద్యార్థిని ప్రస్తుతం గుంటూరులో బీ.టెక్ రెండవ సంవత్సరం చదువుతుందని, మహిళా దినోత్సవం సందర్భంగా ల్యాప్ టాప్ అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లాయిచిట్టూరు నీటి సంఘం అధ్యక్షులు ఆవుల ధర్మ వెంకట నరసయ్య, మాజీ జడ్పీటీసీ లోయ నాగ శ్రీనివాసరావు, ఎస్.రామ్మోహనరావు, గ్రామస్థులు పాల్గొని ల్యాప్ టాప్ అందించటం జరిగింది. మంచిగా చదువుకుని భవిష్యత్లో ఉన్నత స్థితికి ఎదగాలని విద్యార్థిని కుంపటి తేజస్వినికి సూచించారు.
