airport | శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

airport | శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

airport | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : బెంగళూరు నుంచి నాగ్‌పూర్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్ చేపట్టారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా దింపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

విమాన ప్రయాణం మధ్యలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ వెంటనే శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం అత్యవసర పరిస్థితిని ప్రకటించి విమానాన్ని హైదరాబాద్ వైపు మళ్లించారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

విమానంలో మొత్తం 126 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణీకులు క్షేమంగా ఉన్నారు. సాంకేతిక లోపానికి గల కారణాలను గుర్తించేందుకు ఇండిగో సాంకేతిక బృందం పరిశీలనలు ప్రారంభించింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి విమానయాన సంస్థ చర్యలు చేపట్టింది.

Leave a Reply