Agents | మోడలింగ్ పేరుతో యువతుల అక్రమ రవాణా

Agents | మోడలింగ్ పేరుతో యువతుల అక్రమ రవాణా
Agents | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కొచ్చిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మోడలింగ్, ఉద్యోగ అవకాశాల పేరుతో యువతులను విదేశాలకు పంపించి వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరు బాధిత యువతుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మోడలింగ్, విదేశీ ఉద్యోగాల పేరుతో యువతులను ఆకర్షించిన నిందితులు.. భారీ సంపాదన ఆశ చూపించి వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యువతులను పరిచయం చేసిన ఏజెంట్లకు కూడా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు విచారణలో తేలింది.
ఈ రాకెట్ వెనుక అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను అధికారులు ఏర్పాటు చేశారు. విదేశాల్లో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతుండగా.. అవసరమైతే ఇంటర్‌పోల్ సహాయం తీసుకునే యోచనలో కొచ్చి పోలీసులు ఉన్నట్లు సమాచారం.
