Accident | ఘోర రోడ్డు ప్రమాదం..

Accident | ఘోర రోడ్డు ప్రమాదం..

  • నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..
  • మైత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ..
  • హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న బస్సు..
  • స్పాట్ లో ఇద్దరు మృతి..
  • మరో 10 మంది కి తీవ్ర గాయాలు..
  • ఇద్దరి పరిస్థితి విషమం..
  • బస్సులో 36 మంది ప్రయాణికులు..

నంద్యాల బ్యూరో /ఆళ్లగడ్డ, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లె గ్రామం మెట్ట సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాదు (Hyderabad) నుండి పాండిచ్చేరి వెళుతుండగా వెనుక వైపు నుండి లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 10 మంది వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో ఉన్న ప్రయాణికులు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం బస్సును జాతీయ రహదారి పక్కన డ్రైవర్ నిలిపారు. ఆళ్లగడ్డకు సమీపంలోని పేరాయిపల్లి గ్రామం సమీపన జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. అత్యధిక స్పీడ్ తో వస్తున్న లారీ ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీ కొట్టింది. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ సంఘటన జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన 10 మంది వ్యక్తులను ఆళ్లగడ్డ నంద్యాల ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం తరలించారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. మైత్రి ట్రావెల్స్ బస్సు ముందు, వెనుక భాగాలు ఘోరంగా దెబ్బతిన్నయి.

ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు హైదరాబాద్ కు చెందిన వాసులుగా గుర్తించారు. డ్రైవర్ లారీ కేబిన్‌లో ఇరుక్కుపోగా స్థానికులు పోలీసులు రోప్ సాయం చేసి బయటకు తీశారు. గాయపడిన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీస్పీ ప్ర‌మోద్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద కారణాల పై పోలీసులు (Police) కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాట్లు తెలిపారు. వరుస రోడ్డు ప్రమాదాలతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రమాదాలు అధికమయ్యాయి. ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాల్లోని ఇప్పటికి అధిక మంది ప్రయాణికులు మృతి చెందటం ప్రజలను కలవరపెడుతుంది.

Leave a Reply