Hospital | ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు

Hospital | ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు

  • కమిషనర్ సతీమణి ప్రసవం.. పండంటి పాపకు జన్మ..
  • ప్రభుత్వ వైద్యంపై పెరుగుతున్న నమ్మకం..
  • ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్ అధికారి ప్రఫూల్ దేశాయ్
  • జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు అభినందనలు

Hospital | కరీంనగర్ సిటీ, ఆంధ్రప్రభ : ప్రైవేటుకు ధీటుగా సేవలందిస్తున్న ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం రోజురోజుకు పెరుగుతోంది. ఐఏఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు సైతం అత్యుత్తమ సేవలను ప్రభుత్వాసుపత్రిలో పొందుతున్నారు. ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో సేవలందించడంతో రోజురోజుకు ప్రభుత్వ ఆస్పత్రి సేవలపై పాజిటివ్ దృక్పథం పెరిగిపోతున్నది. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులకే ప్రాధాన్యమి స్తున్నారు. ఇందుకు విశేషం ఏమిటంటే కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్ ఐఏఎస్ అధికారి ప్రఫుల్ దేశాయ్ సతీమణి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి మాత శిశు కేంద్రంలో పండంటి పాపకు జన్మనిచ్చింది.

మున్సిపల్ కమిషనర్ దంపతులు ఆదర్శంగా నిలిచారు. వారిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి వైద్యాధికారులు సిబ్బంది అభినందించారు. గర్భవతి అయిన మున్సిపల్ కమిషనర్ సతీమణినీ కమిషనర్ ప్రఫులు దేశాయ్ ఆదివారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఉమ్మనీరు తగ్గడంతో ప్రభుత్వ ప్రధానాస్పత్రి మాత శిశు కేంద్రంలో చేర్పించారు. సోమవారం గైనకాలజిస్టుల పర్యవేక్షణలో ఆమెకు ఆపరేషన్ చేశారు. అనుభవజ్ఞులైన గైనకాలజిస్ట్లు నిపుణులైన వైద్య బృందం నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో డెలివరీని విజయవంతంగా నిర్వహించారు.

దీంతో మున్సిపల్ కమిషనర్ సతీమణి పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. హెచ్డీ గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మజ గైనకాలజిస్టులు డాక్టర్ దీప సంగీత సుహాసిని పిల్లల వైద్య నిపుణులు వేణు మల్లికార్జున్ అనస్థీసియా హెచ్డీ డాక్టర్ శంతన్, సంగీత నర్సింగ్ సూపరిండెంట్ సరిత పద్మశ్రీ రమ వైద్య సేవలు అందించారు.

Leave a Reply