Mopidevi | విద్యుత్ అంతరాయాలకు చెక్..

Mopidevi | విద్యుత్ అంతరాయాలకు చెక్..

  • ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చిత్రపటానికి పాలాభిషేకం

Mopidevi | మోపిదేవి, ఆంధ్రప్రభ : గ్రామాలలో విద్యుత్ అంతరాయాలకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టిందని సర్పంచ్ కోసూరు అనూష అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన “పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం ” ( RDSS ) కార్యక్రమాన్ని సర్పంచ్ అనూష ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు అలాగే గ్రామస్తులతో కలిసి అనూష 24 గంటల విద్యుత్ సరఫరాను ప్రారంభించారు.

అనంతరం అవనిగడ్డ శాసనసభ్యులు, రాష్ట్ర శాసనసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తమ గ్రామ అభివృద్ధికి బుద్ధప్రసాద్ కృషి చేస్తున్నారని సర్పంచ్ అనూష కొనియాడారు. నాగాయతిప్ప టౌన్ ఫీడర్ పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామపంచాయతీకి త్రీ ఫేస్ విద్యుత్ అమర్చడం వలన 24 గంటల పాటు గ్రామంలో విద్యుత్ సరఫరా అవుతుందని RDSS నాగాయతిప్ప టౌన్ ఫీడర్ ఇంజనీరింగ్ సహాయకులు సురేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సనకా వెంకట రాజేష్ బాబు, ఉప సర్పంచ్ కోసూరు రాధాకృష్ణమూర్తి, గ్రామ ప్రముఖులు కోసూరు శివనాగమల్లేశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ కోసూరు నాగమల్లేశ్వరరావు, బీజేపీ మండల అధ్యక్షుడు సనకా ప్రశాంత్, కోసూరు మునీంద్ర, యక్కటి రామాంజనేయులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు యక్కటి హనుమాన్ ప్రసాద్, గరికిపాటి కృష్ణ ప్రసాద్, కోసూరు రామారావు, కోసూరు పవన్, కోసూరు అమలేశ్వరరావు, సనకా జనార్ధనరావు, కోసూరు వేణుగోపాలరావు, బడే వినయ్, బడే రామకృష్ణ, విద్యుత్ శాఖ సహాయకులు డొక్కు శివరామకృష్ణ, భోగిరెడ్డి రాజా, కోసూరు పున్నయ్య, కోసూరు రేణుకయ్య, కోసూరు రామాంజనేయులు, మేస్త్రి మునిపల్లి శ్రీనివాసరావు లతో పాటు పెద్ద సంఖ్యలో కూటమి పార్టీల శ్రేణులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply