AP CM | జిల్లా అభివృద్ధికి పాటుపడండి..

AP CM | జిల్లా అభివృద్ధికి పాటుపడండి..
- … ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లండి
- … ప్రభుత్వ పథకాల అమలు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండాలి
- … నంద్యాల జిల్లా అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
AP CM | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏపీ సచివాలయం నుంచి జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై నంద్యాల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నంద్యాల కలెక్టరేట్‌లోని వీసీ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ , జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ మరియు సంబంధిత జిల్లా అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ అంశాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ

• విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టాం.
• 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ప్రజల ఆశల్ని నిలబెట్టాం. వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించాం
• అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగాం
• ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిస్తున్నాను అన్నారు.
• తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు వేశామన్నారు.
• స్త్రీశక్తి ద్వారా 3.5 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు. దీని కోసం ఇప్పటి వరకూ రూ.1114 కోట్లు వ్యయం చేశాం అన్నారు.
• అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు జమ చేశాం.
• దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లను ఇప్పటికీ పంపిణీ చేయగలిగాం. దీనికి రూ.2,684 కోట్లు వ్యయం చేశామన్నారు.
• ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించటంలో సంక్షేమంలో కొత్తమైలు రాయిని సాధించాం.
• 70 వరకూ పెద్ద పథకాలు, కార్యక్రమాలు, పనులు చేశాం.
• అమరావతిని శ్మశానం అని, ఎడారని ఎగతాళి చేశారు. కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు.
• అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నాం.
• పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.
• ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోంది.
• పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నాం
• నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంది.
• ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి.
• పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
• తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదు.
• రెండు తెలుగు రాష్ట్రాలూ గోదావరి జలాలను సమర్ధంగా వినియోగించుకోవచ్చు.
• పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం.
• భోగాపురం ఎయిర్ పోర్టు కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తాం.
• విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర సహకారంతో రూ.12 వేల కోట్ల సాయంతో దానిని కాపాడుకున్నాం అన్నారు.
• ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లలోనూ 970 టీఎంసీలను . రాయలసీమలోనూ పెద్ద ఎత్తున నీటిని నిలిపాంఅన్నారు.
