Financial assistance | ఆర్థిక సాయం

Financial assistance | ఆర్థిక సాయం

Financial assistance | బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించి గత సంవత్సరం సెప్టెంబర్ 11న అకాల మరణం పొందిన ధనుంజయ్ కుటుంబానికి జిల్లా ఎఫ్టీఈలు ఇవాళ‌ రూ.లక్ష 40వేల(Rs. 1 lakh 40 thousand) ఆర్థిక సహాయాన్ని(Financial assistance) అందించారు.

ఈ మేరకు ఆయన భార్య శ్రీలతకు డీఆర్డీవో పీడీ సాయగౌడ్ అందించారు. ఈ కార్యక్రమంలో ఏవీవో నారాయణ, అంబుడ్స్ మెన్ శ్రీనివాస్, బాల్కొండ ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, ఏపీవో ఇందిరా, టెక్నికల్ అసిస్టెంట్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగార్జున, కోశాధికారి అరవింద్, టెక్నికల్ అసిస్టెంట్ లు రవీందర్, వరగంగా, కంప్యూటర్ ఆపరేటర్ రమ, ఫీల్డ్ అసిస్టెంట్లు అనిల్, కిషోర్, రాజనర్సయ్య, గంగాధర్, నర్సయ్య, లక్ష్మి, రాజేందర్, సురేష్, విప్లవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply