AP Deputy CM | శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం

AP Deputy CM | శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం

  • మతవిద్వేష శక్తుల పట్ల బీ అలెర్ట్
  • కాకినాడ పోలీస్ ఆఫీసర్లతో డిఫ్యూటీ సీఎం భేటీ

AP Deputy CM | ఆంధ్రప్రభ, కాకినాడ బ్యూరో : శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోలీసు (Police) అధికారులకు సూచించారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణ పకడ్బందీగా ఉండాలి, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి, ఉల్లంఘనలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించవద్దు, అని డిప్యూటీ సీఎం ఆదేశించారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. శనివారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు.

AP Deputy CM

AP Deputy CM | డయల్ 100 పని తీరుపై ఆరా

కమాండ్ కంట్రోల్ రూం, ఆఫీసర్స్ (Officers) జిమ్ తదితర విభాగాలను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూంలో డయల్ 100 పని తీరుపై ఆరా తీశారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులు ఫోన్ చేసినప్పుడు సాంకేతికత సాయంతో లొకేషన్ ఎలా గుర్తిస్తారు…దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ (Police Station) సిబ్బందికి సమాచారం ఎలా చేరవేస్తారు.. తదితర అంశాలను పోలీస్ అధికారులు వివరించారు. స్నేహపూర్వక సేవలు అందిస్తూ పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు.

AP Deputy CM
AP Deputy CM
AP Deputy CM
AP Deputy CM
AP Deputy CM
AP Deputy CM
AP Deputy CM
AP Deputy CM
AP Deputy CM
AP Deputy CM

CLICK HERE TO READ వంతెన నిర్మాణం పనుల నాణ్యత పరిశీలన

CLICK HERE TO READ MORE

Leave a Reply