CM | సహాయనిధి చెక్కుల పంపిణీ

CM | మోత్కూర్, ఆంద్రప్రభ : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు జిల్లా కాంగ్రెస్ నాయకులు గుర్రం లక్ష్మీ నర్సింహారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్ర గౌడ్ చేతుల మీదుగా శనివారం అందజేశారు. లబ్ధిదారులు కూరెళ్ళ పెంటయ్య (గాంధీనగర్)రూ.40,500, ఎల్దండ కృష్ణా రెడ్డి (రాజన్నగూడెం) రూ. 60,000, మొగుళ్ళ శ్రీనివాస్ రెడ్డి (బుజిలపురం) రూ.58500 లకు మంజూరైన చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ బొల్లపల్లి వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పురుగుల నరసింహ, జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి మందుల సురేష్,పోల్నేని స్వామి రాయుడు, తదితరులు ఉన్నారు.
