Sirish Kumar | ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా ఆంధ్రప్రభ

Sirish Kumar | ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా ఆంధ్రప్రభ

  • క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీడీసీఎల్ శిరీష్ కుమార్
  • రిటైర్డ్ లైన్ ఇన్ స్పెక్టర్ రమేష్ కుమార్

Sirish Kumar | హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : ప్రజలకు..ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఆంధ్రప్రభ పనిచేస్తూ, ఎన్నో దశాబ్దాలుగా నిష్పక్ష వార్తలతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని ఎన్పీడీసీఎల్ హసన్ పర్తి ఏఈ చుంచు శిరీష్ కుమార్ అన్నారు. ఇవాళ‌ హసన్ పర్తి మండల కేంద్రంలో ఆంధ్రప్రభ క్యాలెండర్ ను స్థానిక విలేకరి వేల్పుల ఓదెలు ఆధ్వర్యంలో శిరీస్ కుమార్ తో పాటు రిటైర్డ్ లైన్ ఇన్స్పెక్టర్ రౌతు రమేష్ కుమార్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శిరీష్ కుమార్ మాట్లాడుతూ… ప్రజాసామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తున్నదని పేర్కొన్నారు. సమాజంలో చైతన్యం, అవగాహన పెంచడంలో ఆంధ్రఫ్రభ సేవలు అభినందనీయమని తెలిపారు. రమేష్ కుమార్ మాట్లాడుతూ… ప్రజాధరణ కలిగిన పత్రికలలో ఆంధ్రప్రభ.. అగ్రభాగంగా ఉంటూ నిజాలను, నిక్కచ్చిగా, నిర్భయంగా రాస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నదన్నారు. కాలానికి అనుగుణంగా వెబ్, స్మార్ట్ ఎడిషన్ తో డిజిటల్ తీసుకురావడంతో పత్రికకు మైలేజీ మరింత పెరిగిందని తెలిపారు. దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రభ విలువలతో కూడిన జర్నలిజం చేస్తూ, ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వార్తలతో ప్రజలకు చేరువకావడం సంతోషకరమన్నారు.

Leave a Reply