Public Meeting | గోదావరిఖనిలో రేపటి భారీ సభకు సర్వం సిద్ధం…

Public Meeting | గోదావరిఖనిలో రేపటి భారీ సభకు సర్వం సిద్ధం…

  • మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్న సభకు వేగవంతమైన ఏర్పాట్లు
  • గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానంలో రేపు కాంగ్రెస్ బహిరంగ సభ

Public Meeting | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రేపు (జనవరి 11) గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ(public meeting) ఏర్పాట్లను రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ ఇవాళ‌ పరిశీలించారు.

ఈ బహిరంగ సభకు ఐటీ శాఖ మంత్రి, మంథని శాసనసభ్యుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు, మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్(Parliament) సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్న నేపథ్యంలో సభా స్థలంలోని వేదిక, భద్రత, వాహన పార్కింగ్, విద్యుత్, తాగునీటి వసతులు తదితర ఏర్పాట్లను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు.

సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్(police) శాఖతో పాటు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కమిషనర్, అదనపు కలెక్టర్ జల్దా అరుణ శ్రీ, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply