Deputy CM | వంతెన నిర్మాణం పనుల నాణ్యత పరిశీలన

Deputy CM | వంతెన నిర్మాణం పనుల నాణ్యత పరిశీలన
- గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని సందర్శించిన పవన్ కళ్యాణ్
- ఉప ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెబుతూ ప్లకార్డులు ప్రదర్శించిన కాలనీ వాసులు
Deputy CM | పిఠాపురం, ఆంధ్రప్రభ : పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy Cm Pawankalyan) ఈ రోజు సదర్శించారు. సుద్దగడ్డ కాలువపై నిర్మించిన వంతెన పనుల నాణ్యతను ఆయన పరిశీలించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సుద్దగడ్డ కాలువపై రూ.3.05 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు భవనాల శాఖ ఈ వంతెన నిర్మించింది.

Deputy CM | కాలనీవాసుల సమస్యలు అడిగి..
2024 సెప్టెంబర్‌లో పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా హౌసింగ్ కాలనీ (Colony) సందర్శనకు వచ్చిన సందర్భంగా వరద ముంపులో ఉంది. పడవపై వెళ్లి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువకు వరద వచ్చిన ప్రతీసారి ముంపునకు గురవుతోందని, రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని హౌసింగ్ కాలనీ వాసులు పవన్ కళ్యాన్‌కు వివరించారు. వరదలు వచ్చిన ప్రతిసారి జనజీవనం స్తంభించిపోతుందని వాపోయారు.

Deputy CM | కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి హామీ
ఆ సందర్భంలో కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ మేరకు కార్యాచరణ రూపొందించి హామీ నెరవేర్చారు. శుక్రవారం సంక్రాంతి మహోత్సవ వేదికపై లాంఛనంగా బ్రిడ్జిని (Bridge) ప్రారంభించి శనివారం పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ముంపు కష్టాలు తొలగించిన ఉప ముఖ్యమంత్రికి కాలనీ వాసులు, స్కూలు పిల్లలు థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్.. అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు.




