Srivari | సేవలో ఇస్రో చైర్మన్

Srivari | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. జనవరి 12న పీఎస్ఎల్వీ-సీ62 (PSLV-C62) రాకెట్‌ను లాంఛ్ చేయనుంది. ఏపీలోని శ్రీహరి కోటలోని లాంచింగ్ ప్యాడ్ నుంచి 12న ఉదయం 10.17 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది.

ఈనెల 12 న పీఎస్ఎల్వీ-సి62 రాకెట్ ద్వారా గగనతలంలోకి పంపనున్న ఈఓఎస్-ఎన్1 విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలకు, ఇస్రో చైర్మన్ నారాయణన్ కు వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ ను పట్టువస్త్రంతో సత్కరించి, ఇస్రో శాస్త్రవేత్తలకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Leave a Reply