TG | వివేకానంద జయంతి కోసం..

TG | వివేకానంద జయంతి కోసం..
TG, వికారాబాద్, ఆంధ్రప్రభ : జనవరి 12న నిర్వహించే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ధారూరు మండలం నాగారం గ్రామంలో ఉత్సవాల నిర్వహించడానికి మాజీ పీఏసీఎస్ చైర్మన్ రెడ్డి 15వేల రూపాయల విరాళాన్ని అందించారు. యువత వివేకానందను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. నాగారం గ్రామంలో వివేకానంద విగ్రహానికి అలంకరించడంతో పాటు పోటీలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
