Choutuppal | ఇంటర్మీడియట్ కళాశాలలు ఏర్పాటు చేయాలి

Choutuppal | ఇంటర్మీడియట్ కళాశాలలు ఏర్పాటు చేయాలి

  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Choutuppal | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాదులో ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు.

నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, మర్రిగూడెం, ఘట్టుప్పల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలు ఏర్పాటు చేయాలనీ, మునుగోడు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిన నియోజకవర్గమని, మండలానికి ఇంటర్ కళశాల ఉంటే పేద విద్యార్థులు ఇక్కడే చదువుకునే అవకాశం ఉంటుందని వీలైనంత తొందరగా ఆయా మండల కేంద్రాలలో ప్రభుత్వ ఇంటర్ కళశాలలను ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరారు.

Leave a Reply