MLA | ఆర్థిక సహాయం..

MLA | ఆర్థిక సహాయం..

  • అంబేద్కర్–జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణల‌కు రూ.ల‌క్ష అందజేత

MLA | తిరువూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెద్ద కొమిర గ్రామంలో ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విగ్రహావిష్కరణ నేప‌థ్యంలో తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెద్ద కొమిర గ్రామ యువతకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం, న్యాయం కోసం జీవితాంతం పోరాడిన డాక్టర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ప్రతిష్ఠ గ్రామ ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధితో పాటు సామాజిక చైతన్యం పెంపొందించే కార్యక్రమాలకు తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద కొమిర గ్రామ యూత్, ఎంఆర్పీఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply