Invitation | సంక్రాంతి జాతర మహోత్సవాలకు ఆహ్వానం

Invitation | గన్నవరం – ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండల పరిధిలోని రామవరప్పాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ వార్ల సంక్రాంతి జాతర మహోత్సవాలు ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జాతరను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో పి.ప్రియాంక, చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావు నేతృత్వంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులను మర్యాదపూర్వకంగా కలసి జాతర మహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ… శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రామవరప్పాడు టీడీపీ ఆద్యక్ష్యలు నబిగాని కొండా, ధర్మకర్తల మండలి సభ్యులు లక్కంరాజు మల్లికార్జునరాజు, పోతన వెంకట దుర్గానాగేశ్వరరావు, కాకాని శివరామ్, గడ్డం ఏడుకొండలు, అడ్డగిరి రజని, వేమినేని కనకదుర్గ, ఇనమాల పార్వతి, మొదిలి సంధ్య, టీడీపీ నాయకులు అద్దేపల్లి సాంబశివ నాగరాజు (సాంబు), కొంగన రవి, కళ్లేపల్లి సాయి తదితరులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply