School – path | కళాశాలలో బడి – బాట కార్యక్రమం

School – path | కళాశాలలో బడి – బాట కార్యక్రమం

School – path | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు బడి – బాట(School – Path) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కే.వేంకయ్య మాట్లాడుతూ… మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థుల సంక్షేమమే సిబ్బంది తమ ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు.

అన్ని రంగాలలో విద్యార్థుల(students)ను తీర్చిదిద్ది వారిని ఉన్నత స్థానంలో నిలబెడతామని ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దేవన్న మాట్లాడుతూ… విజ్ఞానాన్ని అందించి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని అన్నారు.

School - path |

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తొంటి. దేవన్న, కళాశాల అకాడమిక్ కో – ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, కళాశాల కామర్స్ హెచ్. ఓ .డి. ఏ.మనోజ్ కుమార్ తో పాటు లెక్చరర్లు అంజయ్య, శ్రీకాంత్, రికార్డు అసిస్టెంట్ శ్రీనివాస్, స్థానిక జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మధు కుమార్, వైష్ణవిలతో పాటు వెంకటేశ్వర్లు, గంగాధర్, ఆనంద్ కుమార్, మురళి, సుమిత్ర, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply