Mass Director | బోయపాటికి డేట్స్ ఇచ్చే హీరో ఎవరు..?

Mass Director | బోయపాటికి డేట్స్ ఇచ్చే హీరో ఎవరు..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఊర మాస్ డైరెక్టర్ అంటే.. ఠక్కున బోయపాటి శ్రీను గుర్తొస్తారు. ఆయన సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఎంత మాస్ గా ఉంటాయో.. ఎంత యాక్షన్ ప్రధానంగా ఉంటాయో.. అంతే మోతాదులో ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా ఉంటాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల అఖండ 2 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే.. ఈ సినిమా అంచనాలను అందులేకపోయింది అనేది వాస్తవం. దీంతో బోయపాటి నెక్ట్స్ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. అఖండ 3 తీయాలి అనుకున్నప్పటికీ.. ఇప్పుడు ప్లాన్ మారిందని తెలిసింది. ఇంతకీ బోయపాటి ప్లాన్ ఏంటి..?
Mass Director | అఖండ 3 ఇప్పట్లో లేనట్టేనా..

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ.. ఈ మూడు సినిమాలు ఒకదానిని మించి మరోటి సక్సెస్ సాధించాయి. దీంతో బాలయ్య, బోయపాటి కాంబో అంటే.. బ్లాక్ బస్టరే అనే నమ్మకం అటు ఆడియన్స్ లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఏర్పడింది. అయితే.. అఖండ మూవీకి సీక్వెల్ గా రూపొందిన అఖండ 2 మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మరి.. అఖండ 3 ఉంటుందా..? అంటే అనుమానమే. ఇటీవల బోయపాటి నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేస్తారని.. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో బోయపాటి తదుపరి సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది కానీ.. ఇప్పుడు ప్లాన్ మారిందని.. ఈ ప్రాజెక్ట్ లేదు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.
Mass Director | బోయపాటి బాలీవుడ్ మూవీ..

బోయపాటి ప్లాన్ ఏంటంటే.. బాలీవుడ్ మూవీ చేయాలి అనుకుంటున్నారట. బాలయ్య ఇప్పుడు మలినేని గోపీచంద్ తో మూవీ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లానింగ్ జరుగుతుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 చేయనున్నారు. ఈ మూవీని తెరకెక్కించే బాధ్యతను క్రిష్ చేతిలో పెట్టినట్టు సమాచారం. ఈ రెండు సినిమాలు పూర్తి చేయడానికి టైమ్ పడుతుంది. అందుచేత బాలయ్యతో బోయపాటి సినిమా ఇప్పట్లో ఉండదు. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు బిజీగా ఉన్నారు కానీ.. ఎవరూ ఖాళీగా లేరు. అందుచేత బోయపాటి ఎవరితో సినిమా చేయాలి అనుకుంటుంటున్న ఈ టైమ్ లో.. బాలీవుడ్ నుంచి భారీగా ఆఫర్స్ వస్తున్నాయట. ఇప్పుడు టాలీవుడ్ హీరోల కోసం వెయిట్ చేయడం కంటే.. బాలీవుడ్ మూవీ చేయడమే బెస్ట్ అని ఫిక్స్ అయ్యారట బోయపాటి. మరి.. ఏ బాలీవుడ్ హీరోతో బోయపాటి మూవీ సెట్ అవుతుందో చూడాలి.

