10 Mints 10 cr | సాహసం చేయబోతున్న విష్ణు..
10 Mints 10 cr | సాహసం చేయబోతున్న విష్ణు..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు విష్ణు మంచు సాహోసోపేతమైన నిర్ణయం(A courageous decision) తీసుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్ కొత్త ఏడాది సందర్భంగా ఓ కీలక ప్రకటన చేసింది. ఇండియా వైడ్‌గా ఉన్న కొత్త టాలెంట్, న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్(New Generation Filmmakers) అందరికీ అవా ఎంటర్టైన్మెంట్ ఆహ్వానం పలుకుతోంది. రూటెడ్ స్టోరీలు చెప్పే విజన్, క్రియేటివిటీ ఉన్న న్యూ మేకర్లని ఒక చోటకు చేర్చాలని విష్ణు మంచు ప్రయత్నిస్తున్నారు.

దానిలో భాగంగా కొన్ని ఆలోచనల్ని పంచుకున్నారు. ఓ పది నిమిషాల నిడివి ఉన్న లఘు చిత్రం(A short film) కూడా మన జీవితాన్ని మార్చేయగలదు. చిన్నగా ప్రారంభైన ప్రయాణమే గొప్ప స్థాయికి వెళ్లొచ్చు. ఓ గొప్ప సినిమా అనేది దాని స్కేల్ లేదా నేపథ్యం నుంచి కాకుండా.. ఆలోచన, అందులోని స్పష్టత, భావోద్వేగం, సృజనాత్మకత(Clarity, emotion, creativity) నుంచి పుడుతుందని అవా ఎంటర్‌టైన్‌మెంట్ నమ్ముతోంది. ఇది ఒక సాధారణ పోటీ లేదా సాంప్రదాయ లాంచ్‌ప్యాడ్ కాదు. పరిశ్రమ పై లోతైన అవగాహన, అనుభవం, స్పష్టమైన ఉద్దేశంతో రూపొందించిన ఒక ప్రత్యేకమైన అవకాశం ఇది.

సినిమా ఇండస్ట్రీలోకి(into the film industry) రావాలనుకునే వారికి, మార్గం తెలియని వారికి విష్ణు మంచు నిజమైన అవకాశాన్ని అందించడానికి ముందడుగు వేస్తున్నారు. మరిన్ని వివరాలను జనవరి 15న అధికారికంగా వెల్లడించనున్నారు. 10 నిమిషాలు.. ఒక విజన్. భవిష్యత్తు వికసించడానికి వేచి ఉంది అని చెబుతూ శక్తివంతమైనది(Powerful) ఏదో అందరి ముందుకు రాబోతోందని హింట్ ఇచ్చారు. మరి.. జనవరి 15న మంచు విష్ణు ఏం చెబుతారో చూడాలి.
