Raghunath Verabelli | మాటమీద నిల‌బ‌డ‌డ‌మే బీజేపీ లక్ష్యం

Raghunath Verabelli | మాటమీద నిల‌బ‌డ‌డ‌మే బీజేపీ లక్ష్యం

  • బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి

Raghunath Verabelli | దండేపల్లి, ఆంధ్రప్రభ : ఇచ్చిన మాటమీద నిల‌బ‌డ‌డ‌మే బీజేపీ లక్ష్యమని ఆ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. ఇవాళ‌ దండేపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామపంచాయతీ పరిధిలోని మోకాసిగూడలో గత రెండు సంవత్సరాల నుండి నీటి సమస్య ఉండడంతో గ్రామ ప్రజలకు నీటి సమస్య ఉండకూడదని గ్రామస్తుల సౌకర్యార్థం నూతన బోర్ వెల్ వేయించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని నందుర్క సుగుణను గెలిపిస్తే గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధులు రూ.10లక్షలు ఇస్తానన్న మాట ప్రకారం రూ.10 లక్షలతో పాటు, వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట బోర్ వెల్ వేయించి గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్, నందుర్క సుగుణ, ఉపసర్పంచ్ పూదరి రమణయ్య, వార్డు సభ్యులు, మామిడిపల్లి రఘు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply