Schedule 2026 | టీమిండియా బాగా బిజీ బాస్‌..!

Schedule 2026 | టీమిండియా బాగా బిజీ బాస్‌..!

  • టీ20 వరల్డ్​ కప్ సహా పలు కీలక సిరీస్​లు ఆడ‌నున్న భారత జట్టు

Schedule 2026 | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ 2026(Schedule 2026)లో చాలా బిజీగా ఉండబోతోంది. వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక టోర్నీలు ఆడనుంది. భారత్ ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. మరోవైపు, ఈ ఏడాది జరిగే టెస్ట్ సిరీస్‌లు భారత జట్టుకు పరీక్షగా మారనున్నాయి. అఫ్గానిస్థాన్‌(Afghanistan), శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనల్లో టెస్టులు ఆడనుంది.

జనవరిలో: న్యూజిలాండ్- భారత్
నూతన సంవత్సర ఆరంభంలోనే న్యూజిలాండ్‌తో భారత్ వన్డేలు, టీ20 సిరీస్‌ల(T20 series)ను ఆడనుంది. ఈ పర్యటనలో మొత్తం 3 వన్డేలు, 5 టీ20లు జరుగుతాయి.

వన్డే సిరీస్..
11వ తేదీ : 1వ వన్డే – వడోదర
14వ తేదీ: 2వ వన్డే – రాజ్‌కోట్
18వ తేదీ: 3వ వన్డే – ఇందౌర్​

టీ20 సిరీస్..
21వ తేదీ : 1వ టీ20 – నాగ్‌పుర్
23వ తేదీ : 2వ టీ20 – రాయ్‌పుర్
25వ తేదీ : 3వ టీ20 – గువాహటి
28వ తేదీ : 4వ టీ20 – విశాఖపట్నం
31వ తేదీ : 5వ టీ20 – తిరువనంతపురం

ఫిబ్రవరి – మార్చి 2026: టీ20 ప్రపంచకప్..
భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్ తన లీగ్ మ్యాచ్‌లను కింది తేదీల్లో ఆడనుంది.
ఫిబ్రవరి 7: భారత్ vs అమెరికా (ముంబయి)
ఫిబ్రవరి 12: భారత్ vs నమీబియా (దిల్లీ)
ఫిబ్రవరి 15: భారత్ vs పాకిస్థాన్ (కొలంబో, శ్రీలంక)
ఫిబ్రవరి 18: భారత్ vs నెదర్లాండ్స్ (అహ్మదాబాద్)
ఫిబ్రవరి 21 – మార్చి 1: సూపర్ 8 మ్యాచ్‌లు (అర్హత సాధిస్తే భారత్ ఆడుతుంది )
మార్చి 5: సెమీ ఫైనల్ (ముంబయి)
మార్చి 8: ఫైనల్ (అహ్మదాబాద్).

Schedule 2026 | మార్చి నుంచి డిసెంబర్ వరకు షెడ్యూల్..

  • మార్చి 26 నుంచి మే 31 వరకు ఐపీఎల్ 19వ సీజన్ జరగనుంది.
  • అఫ్గానిస్థాన్‌తో భారత్ 1 టెస్టు, 3 వన్డేలు ఆడనుంది. (తేదీలు, వేదికలు ఖరారు కావాల్సి ఉంది). ఈ టోర్నీల కోసం అఫ్గాన్​ భారత పర్యటనకు రానుంది.
  • జులైలో ఇంగ్లండ్‌ పర్యటనకు టీమ్​ఇండియా వెళ్లనుంది. జులై 1 నుంచి జులై 11 వరకు 5 టీ20ల సిరీస్, జులై 14 నుంచి జులై 19 వరకు 3 వన్డేల సిరీస్ టీమ్​ఇండియా ఆడనుంది.
  • ఆగస్టు: శ్రీలంక పర్యటన (2 టెస్టులు)
  • సెప్టెంబర్: అఫ్గానిస్థాన్ వర్సెస్ భారత్ (3 టీ20లు)
  • సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 : జపాన్‌లో ఆసియా క్రీడలు
  • సెప్టెంబర్ – అక్టోబర్: వెస్టిండీస్ పర్యటన (భారత్‌లో) – 3 వన్డేలు, 5 టీ20లు.
  • అక్టోబర్ – నవంబర్: న్యూజిలాండ్ పర్యటన (న్యూజిలాండ్‌లో) – 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు.
  • డిసెంబర్: శ్రీలంక పర్యటన (భారత్‌లో) – 3 వన్డేలు, 3 టీ20లు.

Leave a Reply