Avanigadda | పోలీసులు మెరుపు దాడి..

Avanigadda | పోలీసులు మెరుపు దాడి..

Avanigadda, కోడూరు, ఆంధ్రప్రభ : అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని కోడూరు మండలంలో పేకాట శిబిరం పై పోలీసు మెరుపు దాడి చేశారు. రూ.2.70 లక్షల నగదు స్వాధీనం చేసుకుని ఎనిమిది మంది పేకాట రాయుళ్లు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం ఎస్ఐ చాణక్య తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు.

Leave a Reply