Collector | ఆకస్మిక తనిఖీ..

Collector | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్ల పెంట మండలం కటారుపల్లి కేజీబీవీ విద్యాలయంను మంగళవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించి జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీ విద్యాలయంలోని తరగతి గదులను, వంటగది, త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లును పరిశీలించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధన గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడ చదువుకుంటున్న విద్యార్థినులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి చదువుతున్న వారందరూ ప్రతి రోజు వంద రోజుల ప్రణాళికలో భాగంగా పరీక్షలు వ్రాస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ముందు నుంచి ప్రిపేర్ అయితే పదవ తరగతి చాలా ఈజీ. ఎవ్వరు భయపడకుండా చక్కగా చదువుకొని పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణతతో పాస్ కావాలని విద్యార్థులకు చెప్పారు. అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉన్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిలను కూడా బోధన గురించి పలు వివరాలు అడిగి తెలుసుకొని, ఉన్నతమైన లక్ష్యంతో బాగా చదువుకుని భవిష్యత్తులో మంచి స్థాయికి వచ్చేందుకు ఎదగాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ విద్యాలయ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply