Quake Arena | మత్తులో మ్యూజిక్ కాన్సర్ట్..

Quake Arena | మత్తులో మ్యూజిక్ కాన్సర్ట్..

  • క్వేక్ ఎరీనాలో డ్రగ్స్..
  • 8 మందికి డ్రగ్స్ పాజిటివ్..
  • విదేశీ మహిళల అరెస్ట్..
  • న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల నిఘా..

Quake Arena | హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : న్యూ ఇయర్ వేడుకల వేళ డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. కొండాపూర్‌లోని క్వేక్ ఎరీనా (Quake Arena) పబ్ వేదికగా జ‌రుగుతున్న ఓ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం బయటప‌డింది. ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ డీజే ఆర్బాట్స్తో (DJ Arbatos) నిర్వహిస్తున్న మ్యూజిక్ కాన్సర్ట్ సందర్భంగా ఈగల్ టీమ్ మెరుపు దాడులు నిర్వహించింది.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముసుగులో యువత మత్తులో మునిగిపోతున్నారు. ఈ సోదాల్లో పబ్ (Pub) లోని 14 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా, ఏకంగా 8 మందికి పాజిటివ్ అని తేలింది.

సైబరాబాద్ పోలీసుల (Police) సహకారంతో ఈగల్ టీమ్ గత పది రోజులుగా నగరంలోని పలు పబ్బులపై నిరంతరం నిఘా ఉంచింది. ఈ క్రమంలో ఇప్పటివరకు 27 మంది డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడగా, వారిలో ఐదుగురు విదేశీ మహిళలు ఉండటం గమనార్హం.

నిందితుల నుంచి పోలీసులు భారీ ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 68 గ్రాముల కొకైన్, 50.5 గ్రాముల ఎండీఎంఏతో పాటు ఏకంగా 382 కిలోల గంజాయి ఉండటం డ్రగ్స్ (Drugs) మాఫియా నెట్‌వర్క్ ఎంత లోతుగా విస్తరించిందో స్పష్టం చేస్తోంది.

న్యూ ఇయర్ (New Year) వేడుకల నేపథ్యంలో నగరంలో డ్రగ్స్ సరఫరా జరగకుండా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

CLICK HERE TO READ ప్రజల్లో సేవ చేస్తేనే గుర్తింపు..

CLICK HERE TO READ MORE

Leave a Reply