Congress Leaders | ఉపాధి చట్టాన్ని మార్చొద్దు..

Congress Leaders | ఉపాధి చట్టాన్ని మార్చొద్దు..
- మక్తల్లో కాంగ్రెస్ నిరసన
Congress Leaders | మక్తల్, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా గాంధీ పేరును తొలగిస్తూ, రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మక్తల్లో గాంధీజీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో కీలక భూమిక పోషించిన గాంధీజీ పేరును ఉపాధి హామీ పథకంలో నుంచి తొలగించడం కేంద్ర నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు. వెంటనే గాంధీజీ పేరును తిరిగి జోడించాలని, దీంతోపాటు రాష్ట్రాలపై మోపుతున్న ఆర్థిక భారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జి.లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మండల అధ్యక్షులు బీ.గణేష్ కుమార్, నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, బోయ రవికుమార్, కోళ్ళ వెంకటేష్, కట్ట వెంకటేష్ , మందుల నరేందర్, కున్సీ నాగేందర్, బోయ వెంకటేష్, రాయికోడ్ ఆనంద్, మేదరి శ్రీనివాసులు, అబ్దుల్ రెహమాన్, కావలి తాయప్ప, నూరుద్దీన్, విష్ణు, ఉసాముద్దీన్, రహీం పటేల్, పంచ లింగాల నాగేష్, బోయ నర్సింహ్మ, మెకానిక్ రాము, బాలచందర్, మిస్కిన్ నాగరాజ్, వడ్డే బాలరాజ్, గుంతలి శివకుమార్, కొండయ్య, మొగులప్ప, సురేష్, గడుగు వెంకటేష్, నాగేశ్వరరావు, చందాపురం రాములు, తిరుమలాపురం నర్సింహ్మ, మహేష్, నూరుద్దీన్ పాల్గొన్నారు.
