BRS | కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు

BRS | కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు
- బీఆర్ఎస్ను ఢీకొట్టే సత్తా కాంగ్రెస్‌కు లేదు
- జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
BRS | ఆంధ్రప్రభ ప్రతినిధి, జనగామ : జనగామ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తామే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నామని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు.
ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలో 8 మండలాల్లో నర్మెట 17 జీపీలకు 10 బీఆర్ఎస్, తరిగొప్పుల 15 జీపీలకు ఆరు, జనగామ 21 జీపీలకు 11, కొమరవెల్లి 11 జీపీలకు 7, మద్దూర్ 11 జీపీ లకు 7, దులిమిట్ట 11 జీపీలకు ఏడు, మొత్తం 73 జీపీల సర్పంచ్ అభ్యర్థులు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారన్నారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కనీసం సొంత గ్రామంలో సర్పంచ్‌ను సైతం మెజార్టీ తెచ్చుకోని దౌర్భాగ్య పరిస్థితి అని ఆరోపించారు. రాబోవు జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు.
కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బల్ది సిద్ధులు, మాజీ కౌన్సిలర్ ప్రేమలత రెడ్డి, కొత్త సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు
