Bike | ఘోర‌ రోడ్డు ప్రమాదం..

Bike | ఘోర‌ రోడ్డు ప్రమాదం..

  • ముగ్గురు యువకుల మృతి

Bike | ఏలూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో : ఏలూరు జిల్లా, భీమడోలు మండలం సూరప్పగూడెం జాతీయ రహదారిపై ఇవాళ‌ తెల్లవారుజామున జరిగిన బైక్ ప్రమాదంలో ముగ్గురు యువకులు (youth) అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ద్వారకాతిరుమల ప్రాంతానికి చెందిన రఫీ, చరణ్, బన్నీలుగా గుర్తించారు.

Bike

సమాచారం అందుకున్న సీఐ (CI) యూజే విల్సన్, ఎస్ఐ మదీనా బాషా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు.. మంచు కారణంగా కనిపించకపోవడమా, లేక మరేదైనా వాహనం ఢీకొట్టిందా, వంటి పలు కోణాలలో సీఐ విల్సన్ దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Bike

Leave a Reply