Bekkarapalli | రూ.8 లక్షల ప్రపోజల్ ఎల్ఓసి అందజేత‌

Bekkarapalli | రూ.8 లక్షల ప్రపోజల్ ఎల్ఓసి అందజేత‌

Bekkarapalli | మక్తల్, ఆంధ్రప్రభ : మ‌క్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలం బెక్కరపల్లి గ్రామానికి చెందిన సరస్వతమ్మ అనారోగ్యంతో బాధపడుతూ శస్త్ర చికిత్సకు వైద్య సహాయం కోసం పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడా అండ్ యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని సంప్రదించగా… వారికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద 3 లక్షల రూపాయల ప్రపోజల్ ఎల్ఓసి కాపినీ మంజూరు చేశారు. అదేవిధంగా మక్తల్ మండలంలోని వనాయకుంట గ్రామానికి చెందిన గొల్గ లక్ష్మమ్మకు రూ.5 లక్షల ఎల్ఓసి అందజేశారు. సంబంధిత ప్రపోజల్ ఎల్ఓసి కాపీలను ఇవాళ‌ మంత్రి అధికారిక నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. మంచి వైద్యం అంది, బాధితుడు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.

Leave a Reply