Competition | జనవరి 16న ఉత్సవాలు…

Competition | జనవరి 16న ఉత్సవాలు…

  • శ్రీలక్ష్మీనరసింహస్వామి క‌ల్యాణ వేడుక‌కు ఏర్పాట్లు
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భజన బృందాల పోటీలు

Competition | ఇటిక్యాల, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి గ్రామపంచాయతీ కొండపేట గ్రామంలో జనవరి 16న శ్రీలక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy) కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. క‌ల్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామ లక్ష్మీనరసింహస్వామి భజన బృందం ఆధ్వర్యంలో జనవరి 15న భజన పోటీ కార్యక్రమాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భజన బృందాలు పోటీ(Competition)లో పాల్గొనాల‌ని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. పోటీలు సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు నిర్వహించబడునట్లు వారు తెలిపారు. స్వామివారి కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.

Leave a Reply